Thursday, 3 September 2026
  • Home  
  • శాస్త్రీయ ఆలోచనతోనే కార్మిక వర్గ విముక్తి సాధ్యం
- యాదాద్రి భువనగిరి

శాస్త్రీయ ఆలోచనతోనే కార్మిక వర్గ విముక్తి సాధ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుందని CITUరాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ కార్మికులకు పిలుపునిచ్చారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గారు “శాస్త్రీయ ఆలోచన” అనే అంశంపై ఆమె కార్మికులకు క్లాస్ బోధించి, మాట్లాడారు. ​ఈ సందర్భంగా పద్మశ్రీ గారు మాట్లాడుతూ సమాజ గమనాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ శాస్త్రీయ ఆలోచన అవసరమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, పాతకాలపు ఆలోచనలు కార్మిక వర్గాన్ని వెనక్కి నెడుతుంటే, శాస్త్రీయ దృక్పథం వారిని చైతన్యవంతులను చేస్తుందని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులు రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసే కార్మిక నాయకులకు, కార్యకర్తలకు ఇటువంటి శిక్షణా తరగతులు సైద్ధాంతిక బలాన్ని ఇస్తాయని, భవిష్యత్తు ఉద్యమాలకు దిక్సూచిగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లాసుల ప్రారంభానికి ముందుగా CITU జెండాను జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆవిష్కరించడం జరిగింది.​ఈ శిక్షణా తరగతులకు CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.ఈ క్లాసులో CITU జిల్లా ఆఫీస్ బేరర్స్ దాసరి పాండు, మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి,పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము, పైళ్ల గణపతి రెడ్డి జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, గంధమల్ల మాతయ్య,కసగొని లలిత, పోతరాజు జహంగీర్, మంచాల మధు , అప్పం సురేందర్,డానియల్,మారయ్య,నాయకులు గణేష్ ,సిద్ధులు, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి జిల్లా
సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకున్నప్పుడే కార్మిక వర్గ విముక్తి, హక్కుల సాధన సాధ్యమవుతుందని CITUరాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ కార్మికులకు పిలుపునిచ్చారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ గారు “శాస్త్రీయ ఆలోచన” అనే అంశంపై ఆమె కార్మికులకు క్లాస్ బోధించి, మాట్లాడారు.
​ఈ సందర్భంగా పద్మశ్రీ గారు మాట్లాడుతూ సమాజ గమనాన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థ దోపిడీని అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ శాస్త్రీయ ఆలోచన అవసరమని పేర్కొన్నారు. మూఢనమ్మకాలు, పాతకాలపు ఆలోచనలు కార్మిక వర్గాన్ని వెనక్కి నెడుతుంటే, శాస్త్రీయ దృక్పథం వారిని చైతన్యవంతులను చేస్తుందని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలంటే కార్మికులు రాజకీయంగా, సామాజికంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.నిరంతరం క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసే కార్మిక నాయకులకు, కార్యకర్తలకు ఇటువంటి శిక్షణా తరగతులు సైద్ధాంతిక బలాన్ని ఇస్తాయని, భవిష్యత్తు ఉద్యమాలకు దిక్సూచిగా మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
క్లాసుల ప్రారంభానికి ముందుగా CITU జెండాను జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ఆవిష్కరించడం జరిగింది.​ఈ శిక్షణా తరగతులకు CITU జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.ఈ క్లాసులో CITU జిల్లా ఆఫీస్ బేరర్స్ దాసరి పాండు, మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి,పొట్ట యాదమ్మ, నకిరేకంటి రాము, పైళ్ల గణపతి రెడ్డి జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, గంధమల్ల మాతయ్య,కసగొని లలిత, పోతరాజు జహంగీర్, మంచాల మధు , అప్పం సురేందర్,డానియల్,మారయ్య,నాయకులు గణేష్ ,సిద్ధులు, వెంకటేష్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.