శ్రీకాళహస్తి, ఏప్రిల్ 23 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి మండలం మాదమాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త అక్కుపల్లి సుబ్రమణ్యం ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేడు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, సుబ్రమణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఆయన మృతి తీరని లోటుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుణశేఖర్ రెడ్డి, వెంకట రెడ్డి, చంద్ర రెడ్డి, వెంకటేష్ యాదవ్, గురవయ్య, బ్రహ్మయ్య, చెంచు రామయ్య యాదవ్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి… మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నివాళులు