Sunday, 31 May 2026
  • Home  
  • వైఎస్సార్ బాటలో ప్రజలకు చేరువ కానున్న రేవంత్ ప్రభుత్వం
- హైదరాబాద్

వైఎస్సార్ బాటలో ప్రజలకు చేరువ కానున్న రేవంత్ ప్రభుత్వం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రతి వారం ఒక రోజు ప్రజల సమస్యలు, పార్టీ కార్యకర్తల వినతులు స్వయంగా వినాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేక క్యాంపు కార్యాలయం సిద్ధమైన తర్వాత క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించనున్నారు. అంతవరకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలను స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకునే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రభుత్వ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యక్ష పర్యవేక్షణ పెంచడం ద్వారా పాలనను మరింత సమర్థవంతంగా మార్చడమే ఈ నిర్ణయ లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.