ఖమ్మం, ఆగస్టు
(పున్నమి న్యూస్ ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని న్యూ లక్ష్మీపురం గ్రామానికి చెందిన వేణు ఆత్మహత్యాయత్నం ఘటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల హామీలు అమలు కాకపోవడం, ఉద్యోగాల భర్తీలో జాప్యం వల్ల యువత నిరాశకు గురవుతోందని ఆరోపించారు. వేణు కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే పక్కా ఇల్లు మంజూరు చేయడంతో పాటు ఆర్థిక సహాయం, కుటుంబ సభ్యులకు అవసరమైన అన్ని విధాల మద్దతు అందించాలని వారు డిమాండ్ చేశారు.



