ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26. (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ధుని పూజ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉదయకర్తలుగా బట్టేపాటి రంగారెడ్డి–అసిత దంపతులు, వారి కుమారులు వెంకటేష్, సందీప్, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

వెంకయ్య స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 26. (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలోని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, నూతన పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ధుని పూజ కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల కోసం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఉదయకర్తలుగా బట్టేపాటి రంగారెడ్డి–అసిత దంపతులు, వారి కుమారులు వెంకటేష్, సందీప్, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

