ఏర్పేడు, ఏప్రిల్ 16 (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పల్లం గొల్లపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అక్కుపల్లి వెంకటరామయ్య ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటరామయ్య మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోసి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి కష్టకాలంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. అంత్యక్రియల్లో మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్‌తో పాటు జనార్దన్ యాదవ్, వెంకటేశ్వర యాదవ్, మునయ్య, కన్నయ్య యాదవ్, రామకృష్ణ, భాస్కర్, సుబ్రహ్మణ్యం యాదవ్ తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

వెంకటరామయ్య భౌతికకాయానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు నివాళి