ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీలో అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.78.40 లక్షలతో నిర్మించిన తాగునీటి పథకాలు, రూ.10 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్‌లో రూ.1.80 కోట్లతో తాగునీటి పనులు, రూ.50 లక్షలతో చెరువుకట్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, పనుల్లో పారదర్శకత పాటిస్తున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

వీరంపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీలో అభివృద్ధి పనులకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. రూ.78.40 లక్షలతో నిర్మించిన తాగునీటి పథకాలు, రూ.10 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ప్రారంభించారు. రూ.36 లక్షలతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌కు శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్‌లో రూ.1.80 కోట్లతో తాగునీటి పనులు, రూ.50 లక్షలతో చెరువుకట్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామని, పనుల్లో పారదర్శకత పాటిస్తున్నామని సోమిరెడ్డి పేర్కొన్నారు.

