(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి :
యలమంచిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో అధికారులు కీలక ప్రకటన చేశారు. యలమంచిలి ఎంపీడీఓ శ్రీ కొప్పిశెట్టి సత్య కొండలరావు గారి తల్లి శ్రీమతి కొప్పిశెట్టి సన్యాసమ్మ గారు అకాల మరణం చెందిన నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీన మల్లవరం – రేగుపాలెం ఓల్డ్ బైపాస్ రోడ్డులోని ఎస్వి కన్వెన్షన్లో నిర్వహించాల్సిన పదవీ విరమణ సన్మాన సభను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కుటుంబం తీవ్ర విషాదంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రెస్మీట్లో తెలిపారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సభను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సన్యాసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.


