Friday, 29 May 2026
  • Home  
  • విషాదంతో రద్దైన ఎంపీడీఓ సన్మాన సభ..
- అనకాపల్లి

విషాదంతో రద్దైన ఎంపీడీఓ సన్మాన సభ..

(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్) అనకాపల్లి జిల్లా ఎలమంచిలి : యలమంచిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అధికారులు కీలక ప్రకటన చేశారు. యలమంచిలి ఎంపీడీఓ శ్రీ కొప్పిశెట్టి సత్య కొండలరావు గారి తల్లి శ్రీమతి కొప్పిశెట్టి సన్యాసమ్మ గారు అకాల మరణం చెందిన నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీన మల్లవరం – రేగుపాలెం ఓల్డ్ బైపాస్ రోడ్డులోని ఎస్‌వి కన్వెన్షన్‌లో నిర్వహించాల్సిన పదవీ విరమణ సన్మాన సభను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కుటుంబం తీవ్ర విషాదంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సభను నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సన్యాసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

(పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్)

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి :
యలమంచిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అధికారులు కీలక ప్రకటన చేశారు. యలమంచిలి ఎంపీడీఓ శ్రీ కొప్పిశెట్టి సత్య కొండలరావు గారి తల్లి శ్రీమతి కొప్పిశెట్టి సన్యాసమ్మ గారు అకాల మరణం చెందిన నేపథ్యంలో, ఈ నెల 30వ తేదీన మల్లవరం – రేగుపాలెం ఓల్డ్ బైపాస్ రోడ్డులోని ఎస్‌వి కన్వెన్షన్‌లో నిర్వహించాల్సిన పదవీ విరమణ సన్మాన సభను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కుటుంబం తీవ్ర విషాదంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సభను నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సన్యాసమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.