అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో భారీ యోగా మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి వేలాది మంది యోగా సాధకులు పాల్గొనే అవకాశం ఉంది.
బీచ్ ప్రాంతంలో ప్రత్యేక కార్యక్రమాలు, యోగా శిక్షణ శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల ద్వారా విశాఖను అంతర్జాతీయ యోగా కేంద్రంగా గుర్తింపు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.


