విశాఖపట్నం తీర ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సముద్ర పర్యాటక ప్రాజెక్టులను చేపడుతోంది.
క్రూయిజ్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, బీచ్ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పర్యాటకుల సంఖ్య పెరగడంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు తెలిపారు.


