వివాహ శుభకార్యాలకు హాజరై నవ వధూవరులను ఆశీర్వదించిన మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్
మంచాల: మండలంలోని ఆరుట్ల గ్రామంలో నిర్వహించిన వివిధ వివాహ శుభకార్యాలకు బండలేమూర్ గ్రామ మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్ హాజరై నవ వధూవరులను ఆశీర్వదించారు.
ఆరుట్ల గ్రామానికి చెందిన వేధిరే సికిందర్ రెడ్డి, సభావట్ భాగ్య కుమార్తె లలిత వివాహంతో పాటు, పాతులోత్ కేశ్య (లేట్) కుమార్తె సింధు వివాహ వేడుకలకు ఆయన హాజరై నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. నవ వధూవరులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మంచాల మండల హౌస్ ఇన్స్పెక్టర్ సీఐ మధు, సీనియర్ కానిస్టేబుల్ దేవానంద్, సొసైటీ చైర్మన్ వేధిరే హనుమంత్ రెడ్డి, మంచాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, బండలేమూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



