గాజువాక,సెప్టెంబర్ 16, (పున్నమి ప్రతినిధి)
శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి మహోత్సవం సందర్భంగా దల్లివానిపాలెం గ్రామంలో నిర్వహించిన శ్రీ వరసిద్ధి వినాయక అన్న సమారాధన కార్యక్రమానికి విశాఖ జిల్లా వాలంటీర్ వైస్ ప్రెసిడెంట్ గోందేసి రామిరెడ్డి పదివేల రూపాయలు ధన సహాయం అందించారు. అలాగే సిద్ధేశ్వరం గ్రామ ప్రెసిడెంట్ గోందేసి లక్ష్మణ్ రెడ్డి కలిసి అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని గ్రామ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

