Thursday, 18 June 2026
  • Home  
  • విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 1.621 శాతం డీఏ పెంపు 70 వేల మందికి ప్రయోజనం.. జనవరి 1 నుంచే అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఖమ్మం

విద్యుత్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 1.621 శాతం డీఏ పెంపు 70 వేల మందికి ప్రయోజనం.. జనవరి 1 నుంచే అమలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్ జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్ ) తెలంగాణ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1.621 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపునకు ఆమోదం తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఈ పెంపు ద్వారా లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. విద్యుత్ సౌధలోని జెన్‌కో ప్రధాన కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగం పనితీరును సమీక్షించిన ఆయన, ఈ వేసవిలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. మార్చి 27న రాష్ట్రంలో 18,548 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, మార్చి 13న 341 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైందని తెలిపారు. అయినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం విద్యుత్ సంస్థల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2035-36 నాటికి రాష్ట్రంలో పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు, వార్షిక విద్యుత్ వినియోగం 1,52,626 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశముందని వెల్లడించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఆధునికీకరణ పనులపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోపాలు తలెత్తిన వెంటనే మరమ్మతులు చేపట్టి నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీష్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి జిల్లా రిపోర్టర్ )

తెలంగాణ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 1.621 శాతం డీఏ (డియర్‌నెస్ అలవెన్స్) పెంపునకు ఆమోదం తెలిపారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది.

ఈ నిర్ణయంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ 17.651 శాతం నుంచి 19.272 శాతానికి పెరిగింది. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు ఈ పెంపు ద్వారా లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.9.35 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది.

విద్యుత్ సౌధలోని జెన్‌కో ప్రధాన కార్యాలయంలో ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భట్టి విక్రమార్క ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా విద్యుత్ రంగం పనితీరును సమీక్షించిన ఆయన, ఈ వేసవిలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్ నమోదైనప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు.

మార్చి 27న రాష్ట్రంలో 18,548 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదు కాగా, మార్చి 13న 341 మిలియన్ యూనిట్ల గరిష్ట విద్యుత్ వినియోగం నమోదైందని తెలిపారు. అయినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం విద్యుత్ సంస్థల సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

రాబోయే దశాబ్దంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2035-36 నాటికి రాష్ట్రంలో పీక్ డిమాండ్ 34,137 మెగావాట్లకు, వార్షిక విద్యుత్ వినియోగం 1,52,626 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశముందని వెల్లడించారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటు, ఆధునికీకరణ పనులపై దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్, ట్రాన్స్‌కో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోపాలు తలెత్తిన వెంటనే మరమ్మతులు చేపట్టి నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాష్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్‌కో సీఎండీ హరీష్, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.