SPSR నెల్లూరు జిల్లా, మే 8, 2026: మహిళలు, చిన్నారుల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆపరేషన్ చిన్నారి తల్లి” కార్యక్రమం మరియు “శక్తి యాప్”పై నెల్లూరు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థినిలకు శక్తి యాప్ డౌన్లోడ్ విధానం, వినియోగంపై వివరించారు. అలాగే బాలల రక్షణకు సంబంధించిన ఫోక్సో చట్టం, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1098, 1930 హెల్ప్‌లైన్ నంబర్లను వెంటనే వినియోగించాలని జిల్లా పోలీసులు సూచించారు.



