ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ల పంపిణీ దాదాపు నెల రోజుల ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు.
అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్, ముడి చమురు, ఫైబర్ వంటి ముడి పదార్థాల కొరత ఏర్పడిందని అధికారులు వివరించారు. దీంతో యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, షూస్ తయారీ మరియు రవాణా ప్రక్రియ ఆలస్యమైందన్నారు.
అయితే పాఠశాలలు జూన్ 12న ప్రారంభమయ్యే సమయానికి పాఠ్యపుస్తకాలు మరియు నోట్‌బుక్స్ అందుబాటులో ఉంటాయని అధికారులు హామీ ఇచ్చారు. మిగిలిన వస్తువులను మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ సమయానికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి త్వరగా అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.


