ముథోల్, సెప్టెంబర్ 8(పున్నమి ప్రతినిధి ):ముధోల్ మండలంలోని విట్టొలి గ్రామ పంచాయతీ లో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కాలేవర్ రుచిత దిగంబర్ అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం రేషన్ వ్యవస్థను మరింత పారదర్శకంగా సులభతరంగా మార్చేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేస్తోందన్నారు. వీటి ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ప్రక్రియ వేగంగా సులభంగా జరిగే అవకాశం ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్డులు పొందిన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శివరాజ్, సెక్రటరీ రాజు,రేషన్ డీలర్ మల్లేష్, నాయకులు నగేష్, నారాయణ రెడ్డి లబ్ధిదారులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.



