అనకాపల్లి జిల్లా మే 11 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ ): ఏటికొప్పాక గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలపై వచ్చిన వార్తకు అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. గ్రామంలోని డ్యామేజ్ పైపులు, లీకేజీలు, అక్రమ కనెక్షన్లు గుర్తించి మరమ్మతు పనులు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో సచివాలయం సిబ్బంది, కూటమి నాయకులు, గ్రామ నాయకులు కలిసి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పరిశీలనలు చేస్తున్నారు. గ్రామ ప్రజలు మంచినీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎక్కడైనా లీకేజీలు లేదా డ్యామేజ్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వార్తకు స్పందించి చర్యలు తీసుకున్న అధికారులను గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

వార్తకు కదిలిన అధికారులు.. ఏటికొప్పాకలో నీటి సమస్యలకు చెక్”