వాతావరణ మార్పుల ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వృద్ధులపై తీవ్రంగా పడుతోందని హెల్ప్ఏజ్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. గత మూడు సంవత్సరాల్లో వేడి గాలులు, వరదలు, కరువు వంటి ప్రకృతి వైపరీత్యాలను 78 శాతం మంది వృద్ధులు ఎదుర్కొన్నట్లు నివేదిక తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. 52 శాతం మంది అవసరమైన మందులు కొనుగోలు చేయలేకపోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఒంటరిగా నివసించే వృద్ధులు, 80 ఏళ్లు దాటినవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు మరింత ప్రమాదంలో ఉన్నారని అధ్యయనం పేర్కొంది. వృద్ధుల కోసం ప్రత్యేక వాతావరణ రక్షణ చర్యలు అవసరమని నిపుణులు సూచించారు.

వాతావరణ మార్పుల ప్రభావం వృద్ధులపై తీవ్రంగా పడుతోంది