కాకినాడ జిల్లాలోని అన్ని మండలాల్లోనూ వాడవాడలా కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి,కృష్ణ ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టేందుకు,కార్యక్రమాన్ని తిలకించేందుకు చిన్నపిల్లల మొదలు వృద్ధుల వరకు ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కృష్ణాష్టమి సందర్బంగా తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామంలో గల రాధాకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతో పాటు ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గాడిమొగ గ్రామపంచాయతీ మాజీ ఉప సర్పంచి కొక్కిలిగడ్డ లోకేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వాడవాడలా ఉత్సాహంగా,ఘనంగా నిర్వహించిన కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు