ఐదు కిలోల ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ (ఎఫ్టీఎల్) సిలిండర్ ధరను రూ.11 పెంచడంతో వలస కార్మికులపై అదనపు భారం పడనుంది. స్థానిక చిరునామా రుజువు లేకపోవడంతో ఎక్కువ మంది వలస కార్మికులు ఈ చిన్న సిలిండర్లనే వినియోగిస్తుంటారు. ధరల పెంపుతో పట్టణ, అర్ధపట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రస్తుతం గృహ ఎల్పీజీపై కూడా నష్టాలను భరిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు వెల్లడించారు.

వలస కార్మికులపై గ్యాస్ ధరల పెంపు భారం