Friday, 14 August 2026
  • Home  
  • వర్షపు నీటిలో పత్తి పంట.. రైతు కన్నీటి వేడుకోలు
- ASIFABAD

వర్షపు నీటిలో పత్తి పంట.. రైతు కన్నీటి వేడుకోలు

తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్ సర్పంచ్‌ను వేడుకున్నా ఫలితం లేదని రైతు ఆరోపణ.. పోలీసులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వాంకిడి: పంట చేతికొచ్చే సమయంలో వర్షపు నీరు పొలంలో నిలిచిపోవడంతో పత్తి పంట దెబ్బతింటోందని వాంకిడి మండల కేంద్రానికి చెందిన రైతు ఇటన్కార్ బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి శివారులోని తన వ్యవసాయ పొలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరి రోజుల తరబడి బయటకు వెళ్లడం లేదని తెలిపారు. పక్క పొలానికి ఏర్పాటు చేసిన కట్ట కారణంగా వర్షపు నీటి ప్రవాహం అడ్డుకుపోయి తన పొలంలో నీరు నిలిచిపోతోందని బాపురావు ఆరోపించారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడటంతో పత్తి మొక్కలు బలహీనపడుతున్నాయని, ఎంతో ఆశతో సాగు చేసిన పంట కళ్లముందే దెబ్బతింటుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. పెట్టుబడి మొత్తం నీటిపాలు అయ్యే పరిస్థితి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పంట సాగు చేశానని బాపురావు తెలిపారు. ప్రస్తుతం పొలంలో నీరు నిలిచిపోవడంతో పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మరోసారి భారీ వర్షం కురిస్తే పత్తి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్‌ను కలిసినా పరిష్కారం కాలేదని ఆరోపణ పొలంలో నిలిచిన నీరు బయటకు వెళ్లేందుకు మార్గం కల్పించాలని పక్క పొలం రైతును పలుమార్లు కోరినా సమస్య పరిష్కారం కాలేదని బాపురావు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. దీంతో చివరకు వాంకిడి పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వాపోయారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ఇది వ్యక్తిగత గొడవగా కాకుండా రైతు పంటను కాపాడాల్సిన అత్యవసర సమస్యగా అధికారులు పరిగణించాలని బాపురావు కోరారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి, వర్షపు నీరు సహజంగా వెళ్లే మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల రైతులతో మాట్లాడి ఎవరికీ నష్టం కలగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. “నా పంటను మాత్రమే కాపాడండి” “ఎవరికీ నష్టం చేయాలని లేదు. గొడవ కూడా వద్దు. నా పంటను మాత్రమే కాపాడాలి. పంట పూర్తిగా నష్టపోయిన తర్వాత పరిహారం కోసం తిరగడం కంటే ముందుగానే నీటి సమస్యను పరిష్కరించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి” అంటూ బాపురావు కన్నీటి పర్యంతమయ్యారు. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి రైతు పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

తేదీ: 14 ఆగస్టు 2026 | పున్నమి రిపోర్టర్
సర్పంచ్‌ను వేడుకున్నా ఫలితం లేదని రైతు ఆరోపణ.. పోలీసులను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన
వాంకిడి: పంట చేతికొచ్చే సమయంలో వర్షపు నీరు పొలంలో నిలిచిపోవడంతో పత్తి పంట దెబ్బతింటోందని వాంకిడి మండల కేంద్రానికి చెందిన రైతు ఇటన్కార్ బాపురావు ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి శివారులోని తన వ్యవసాయ పొలంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరి రోజుల తరబడి బయటకు వెళ్లడం లేదని తెలిపారు.
పక్క పొలానికి ఏర్పాటు చేసిన కట్ట కారణంగా వర్షపు నీటి ప్రవాహం అడ్డుకుపోయి తన పొలంలో నీరు నిలిచిపోతోందని బాపురావు ఆరోపించారు. వర్షం కురిసిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడటంతో పత్తి మొక్కలు బలహీనపడుతున్నాయని, ఎంతో ఆశతో సాగు చేసిన పంట కళ్లముందే దెబ్బతింటుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నానని కన్నీటి పర్యంతమయ్యారు.
పెట్టుబడి మొత్తం నీటిపాలు అయ్యే పరిస్థితి
విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పంట సాగు చేశానని బాపురావు తెలిపారు. ప్రస్తుతం పొలంలో నీరు నిలిచిపోవడంతో పంట నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. మరోసారి భారీ వర్షం కురిస్తే పత్తి పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సర్పంచ్‌ను కలిసినా పరిష్కారం కాలేదని ఆరోపణ
పొలంలో నిలిచిన నీరు బయటకు వెళ్లేందుకు మార్గం కల్పించాలని పక్క పొలం రైతును పలుమార్లు కోరినా సమస్య పరిష్కారం కాలేదని బాపురావు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. దీంతో చివరకు వాంకిడి పోలీసులను ఆశ్రయించినప్పటికీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని వాపోయారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి
ఇది వ్యక్తిగత గొడవగా కాకుండా రైతు పంటను కాపాడాల్సిన అత్యవసర సమస్యగా అధికారులు పరిగణించాలని బాపురావు కోరారు. సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పొలాలను పరిశీలించి, వర్షపు నీరు సహజంగా వెళ్లే మార్గాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇరు వర్గాల రైతులతో మాట్లాడి ఎవరికీ నష్టం కలగకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
“నా పంటను మాత్రమే కాపాడండి”
“ఎవరికీ నష్టం చేయాలని లేదు. గొడవ కూడా వద్దు. నా పంటను మాత్రమే కాపాడాలి. పంట పూర్తిగా నష్టపోయిన తర్వాత పరిహారం కోసం తిరగడం కంటే ముందుగానే నీటి సమస్యను పరిష్కరించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి” అంటూ బాపురావు కన్నీటి పర్యంతమయ్యారు.
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి రైతు పంటను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.