Wednesday, 3 June 2026
  • Home  
  • వద్దు అబ్బయ్యా.. మీ అభిమానం చాలు… కేకులు, బొకేలకు దూరంగా రవీంద్ర నాయుడు..
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వద్దు అబ్బయ్యా.. మీ అభిమానం చాలు… కేకులు, బొకేలకు దూరంగా రవీంద్ర నాయుడు..

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వివిధ గ్రామాల అభిమానులకు పార్టీ కార్యకర్తలకు సీనియర్ నేత మాలెపాటి రవీంద్ర నాయుడు జన్మదిన వేడుకలు ఆర్భాటం వద్దని సున్నితంగా తిరస్కరించారు. దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు దగదర్తిలోని వారి నివాసంలో ఉన్న సంగతితెలిసి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు చేరుకున్నారు. రవీంద్ర నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు కేకులు, స్వీట్లతో ఆయనను కలిశారు. కానీ ఆయన ఇలాంటివి వద్దని మీ చల్లని ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటే చాలని అందరిని వారిస్తూ ఎవరు తెచ్చిన కేకులు ,స్వీట్లు వాళ్లకే తినిపించి అందరి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. సంవత్సరాల తరబడిగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ ఎన్నో విజయాలను చేకూర్చిన ప్రజల అభిమానం ముందు ఇలాంటివన్నీ దిగదుడుపే అని పేర్కొంటూ వారి సమస్యలను తెలుసుకున్నారు. తాను అందుబాటులో ఉన్నా లేకపోయినా తమ కుటుంబ సభ్యులు గ్రామంలోనే ఉంటారని ఏ కష్టం వచ్చినా వాళ్లకు తెలిపితే ఆదుకుంటారని రవీందర్ నాయుడు పేర్కొన్నారు. దూరం నుంచి వచ్చిన అభిమానులు అప్పటికి ఒకరిద్దరూ శాలువాలు కప్పాలని బలవంతం చేయడంతో కొన్నిటిని రవీందర్ నాయుడు కాదనలేకపోయారం. ఆనందంలోనే కాక విషాద సమయాల్లో కూడా తాము ఏమి చేయలేకపోయినా వెన్నంటి ఉన్న మండల ప్రజలకు తమ కుటుంబాలు రుణపడి ఉన్నాయని రవీందర్ నాయుడు ఆవేదన కు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు సుబ్బానాయుడు ఆయన కుమారుడు భాను లేకపోవడం పై తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వచ్చిన వారందరికీ రవీందర్ నాయుడు కుటుంబం ప్రత్యేక ఆతిధ్యం ఇచ్చి క్షేమ సమాచారం తెలుసుకున్నారు, ప్రజలకు సేవ చేయడమే తనకు ఆనందమని అందరికీ తెలియజేస్తూ‌రవీంద్ర నాయుడు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వివిధ గ్రామాల అభిమానులకు పార్టీ కార్యకర్తలకు సీనియర్ నేత మాలెపాటి రవీంద్ర నాయుడు జన్మదిన వేడుకలు ఆర్భాటం వద్దని సున్నితంగా తిరస్కరించారు.
దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు దగదర్తిలోని వారి నివాసంలో ఉన్న సంగతితెలిసి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు చేరుకున్నారు. రవీంద్ర నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు కేకులు, స్వీట్లతో ఆయనను కలిశారు. కానీ ఆయన ఇలాంటివి వద్దని మీ చల్లని ఆశీస్సులు మా కుటుంబానికి ఉంటే చాలని అందరిని వారిస్తూ ఎవరు తెచ్చిన కేకులు ,స్వీట్లు వాళ్లకే తినిపించి అందరి క్షేమసమాచారాలు తెలుసుకున్నారు. సంవత్సరాల తరబడిగా తమ కుటుంబాన్ని ఆదరిస్తూ ఎన్నో విజయాలను చేకూర్చిన ప్రజల అభిమానం ముందు ఇలాంటివన్నీ దిగదుడుపే అని పేర్కొంటూ వారి సమస్యలను తెలుసుకున్నారు. తాను అందుబాటులో ఉన్నా లేకపోయినా తమ కుటుంబ సభ్యులు గ్రామంలోనే ఉంటారని ఏ కష్టం వచ్చినా వాళ్లకు తెలిపితే ఆదుకుంటారని రవీందర్ నాయుడు పేర్కొన్నారు. దూరం నుంచి వచ్చిన అభిమానులు అప్పటికి ఒకరిద్దరూ శాలువాలు కప్పాలని బలవంతం చేయడంతో కొన్నిటిని రవీందర్ నాయుడు కాదనలేకపోయారం. ఆనందంలోనే కాక విషాద సమయాల్లో కూడా తాము ఏమి చేయలేకపోయినా వెన్నంటి ఉన్న మండల ప్రజలకు తమ కుటుంబాలు రుణపడి ఉన్నాయని రవీందర్ నాయుడు ఆవేదన కు గురయ్యారు. ఈ సందర్భంగా పలువురు సుబ్బానాయుడు ఆయన కుమారుడు భాను లేకపోవడం పై తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వచ్చిన వారందరికీ రవీందర్ నాయుడు కుటుంబం ప్రత్యేక ఆతిధ్యం ఇచ్చి క్షేమ సమాచారం తెలుసుకున్నారు, ప్రజలకు సేవ చేయడమే తనకు ఆనందమని అందరికీ తెలియజేస్తూ‌రవీంద్ర నాయుడు ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.