ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యావ్యవస్థలో పారదర్శకత కోసం ‘లీప్ యాప్’ (లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్) ను ప్రవేశపెట్టింది. దీనివల్ల తల్లిదండ్రులు తమ పిల్లల పాఠశాల వివరాలు, హోంవర్క్ తెలుసుకోవడానికి ఇకపై విద్యార్థులను అడగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ ద్వారా విద్యార్థుల సమగ్ర సమాచారం మొబైల్లోనే లభిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు ఇళ్లకు వెళ్లి ఈ యాప్‌పై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
సమగ్ర సమాచారం:- విద్యార్థి ప్రొఫైల్, హాజరు (అటెండెన్స్), పరీక్షల మార్కులు, హోంవర్క్ మరియు మధ్యాహ్న భోజనం వంటి వివరాలన్నీ ఒకే చోట లభిస్తాయి.
డౌన్లోడ్ విధానం:- గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్ డౌన్లోడ్ చేసుకొని, ‘స్టూడెంట్’ విభాగంలోకి వెళ్లి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేసి ఓటీపీ (OTP) ద్వారా లాగిన్ అవ్వాలి.
యాప్ లక్ష్యం:- తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మధ్య డిజిటల్ వేదికగా ఉంటూ విద్యావ్యవస్థలో పారదర్శకతను పెంచడం.
ప్రస్తుత గణాంకాలు:- కోవూరు, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో మొత్తం 1,354 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 64,876 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటివరకు 9,897 మంది యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు.


