Sunday, 13 September 2026
  • Home  
  • లారీ కింద పడి డ్రైవర్ దుర్మరణం
- తిరుపతి

లారీ కింద పడి డ్రైవర్ దుర్మరణం

– ప్రమాదాన్ని తప్పించుకునేందుకు దూకిన డ్రైవర్‌పైకే ఎక్కిన లారీ – చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో విషాద ఘటన కడప–చెన్నై ప్రధాన రహదారిపై ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ కింద పడే ప్రమాదం ఉందని భావించిన డ్రైవర్ బి. మురళి వాహనం నుంచి రోడ్డుపైకి దూకారు. అయితే, దురదృష్టవశాత్తు అదే లారీ ఆయనపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాడిపత్రి గ్రామానికి చెందిన బి. మురళిగా ఎస్‌ఐ సుజన్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

– ప్రమాదాన్ని తప్పించుకునేందుకు దూకిన డ్రైవర్‌పైకే ఎక్కిన లారీ

– చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో విషాద ఘటన

కడప–చెన్నై ప్రధాన రహదారిపై ఓబులవారిపల్లి మండలం చిన్నవారంపాడు బ్రిడ్జి సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ కింద పడే ప్రమాదం ఉందని భావించిన డ్రైవర్ బి. మురళి వాహనం నుంచి రోడ్డుపైకి దూకారు. అయితే, దురదృష్టవశాత్తు అదే లారీ ఆయనపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు తాడిపత్రి గ్రామానికి చెందిన బి. మురళిగా ఎస్‌ఐ సుజన్ కుమార్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.