*లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్*
*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా:: తేదీ::07/09/2026*
*లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు శోభా గార్డెన్ సికింద్రాబాద్ యందు జరిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా పాలమూరుకు చెందిన కవి రచయిత డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ ను మెమొంటో శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పాలమూరు ఆబుల్ రెడ్డి, రెడ్ క్రాస్ పాలమూరు సొసైటీ అధ్యక్షులు నటరాజ్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపడం జరిగింది. కవి రచయితకు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి యాదవ్ వివిధ జిల్లా శాఖలు అభినందనలు తెలియజేయడం జరిగింది దాదాపుగా మూడు దశాబ్దాలు పైగా ఉపాధ్యాయ వృత్తి లో కొనసాగుతూనే ఎందరో విద్యార్థులను వివిధ రంగాలలో వారి అభివృద్ధికి మరియు జాతీయ భాష హిందీ అభివృద్ధికి కృషి చేస్తూ ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్న ఉపాధ్యాయునికి అవార్డు రావడం అభినందనీయమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు*

