అనంతసాగరం సెప్టెంబర్ 09, పున్నమి ప్రతినిధి :
అనంతసాగరం మండలం మినగల్లు పంచాయతీ లక్కరాజుపల్లిలో బుధవారం వన్ మంత్ వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల తహసిల్దార్ వీర వసంతరావు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమైన తహసిల్దార్ వీర వసంతరావు మాట్లాడుతూ గ్రామంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు గ్రామస్తులు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను తహసిల్దార్ కు సమర్పించగా వాటిపై ఆయన తక్షణమే స్పందించి సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు..
స్మశానవాటిక స్థలంపై పరిశీలన…
గ్రామస్థులు ప్రధానంగా స్మశానవాటికకు అవసరమైన స్థలం గురించి తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన తహసీల్దార్ సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. తన వెంట వచ్చిన విఆర్ఓ, సర్వేయర్లకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు..ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి కమ్మ ప్రభాకర్ నాయుడు,
వీఆర్వో రవి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



