అనకాపల్లి జిల్లా, జూలై 28 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామంలో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ప్రధాన రహదారిపై గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తోంది. శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాలకు నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు ప్రమాదకరమైన మలుపు వద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడం, ఆటో స్టాండ్ ఉండటం కూడా ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది.
గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు, ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, మంచినీటి కుళాయి పనుల కోసం తవ్విన రోడ్లను సక్రమంగా పూడ్చకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ గారు గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉందో స్వయంగా పరిశీలించి, రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి, భక్తులు, వాహనదారులు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను, ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తున్నారు.
“పేరుకే మేజర్ పంచాయతీ కాదు.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి” అంటూ ఏటికొప్పాక గ్రామ ప్రజలు అధికారులు, నాయకులను కోరుతున్నారు.

రోడ్లు గుంతలమయం.. సమస్యలు కొండంత! ఏటికొప్పాక ప్రజల గోడు పట్టించుకునేదెవరు?
అనకాపల్లి జిల్లా, జూలై 28 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ ఏటికొప్పాక గ్రామంలో రోడ్లు గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడితే ప్రధాన రహదారిపై గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తోంది. శివాలయం, వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయాలకు నిత్యం భక్తులు రాకపోకలు సాగిస్తుండటంతో ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. మరోవైపు ప్రమాదకరమైన మలుపు వద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడం, ఆటో స్టాండ్ ఉండటం కూడా ప్రమాదాలకు కారణమయ్యే పరిస్థితి నెలకొంది. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు, ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడం, మంచినీటి కుళాయి పనుల కోసం తవ్విన రోడ్లను సక్రమంగా పూడ్చకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్ గారు గ్రామంలో ఎక్కడ ఏ సమస్య ఉందో స్వయంగా పరిశీలించి, రోడ్లు, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా గుంతలమయమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి, భక్తులు, వాహనదారులు, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను, ప్రజాప్రతినిధులను విజ్ఞప్తి చేస్తున్నారు. “పేరుకే మేజర్ పంచాయతీ కాదు.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి” అంటూ ఏటికొప్పాక గ్రామ ప్రజలు అధికారులు, నాయకులను కోరుతున్నారు.

