ఖమ్మం రైల్వే స్టేషన్ సమీపంలోని ఆటో స్టాండ్‌లో శనివారం ఎక్సైజ్ పోలీసులు 1.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీహరి రావు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఆటో స్టాండ్ పరిసరాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ఒడిశాకు చెందిన సింహాద్రి రావును తనిఖీ చేయగా అతని వద్ద 1.5 కేజీల గంజాయి లభించింది. దీంతో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, సింహాద్రి రావును అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.85 వేల వరకు ఉంటుందని ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీహరి రావు తెలిపారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించడంతో నిందితుడిపై కేసు నమోదు చేశారు. అనంతరం సింహాద్రి రావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ శ్రీహరి రావు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.



