*రేపల్లెవాడలో ‘వీ ఓ భవన’ శంకుస్థాపన*
*పాల్గొన్న ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ పీఆర్ ఏఈ, సూర్యనారాయణ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్, కాంగ్రెస్ నేతలు*
పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
రేపల్లెవాడ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ‘వీ ఓ భవన’ నిర్మాణానికి ఈరోజు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ సూర్యనారాయణ ఎంపీడీవో భాగ్యశ్రీ, , గ్రామ సెక్రెటరీ రాంప్రసాద్, రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ పాల్గొని శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మాజీ దేవస్థానం చైర్మన్ దళపతి భువనేశ్వర్ రాజు నిమ్మల నరేందర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల నాగేశ్వరావు, వీరబాబు గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ, “గ్రామానికి వివో భవనం రావడం వల్ల వివో లకి మహిళా సంఘాలకు ప్రజలకు సేవలు చేరువ అవుతాయి. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
పీఆర్ ఏఈ సూర్యనారాయణ ఎంపీడీవో భాగ్యశ్రీ మాట్లాడుతూ, “ప్రభుత్వం కేటాయించిన నిధులతో నాణ్యతా ప్రమాణాలతో భవనాన్ని నిర్మిస్తాం. గ్రామస్తులకు అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులోకి వస్తాయి” అని పేర్కొన్నారు.
ఏన్కూరు మండలం యూత్ అధ్యక్షుడు నిమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ భవనంతో పాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపడతాం” అని హామీ ఇచ్చారు.



