🔥 రెడ్డిగూడెం… పండుగైపోయింది! ఎటుచూసినా నాగేశ్వరరెడ్డి జన్మదిన సంబరాలే… ప్రజల నుంచి అపూర్వ అభిమానం!
రెడ్డిగూడెం:
MNR ఫౌండేషన్ చైర్మన్ ముప్పిడి నాగేశ్వరరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రెడ్డిగూడెం గ్రామం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల్లో MNR అభిమానులు, తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
జన్మదినం సందర్భంగా నాగేశ్వరరెడ్డి వినాయక మండపాలను సందర్శించి పూజలు నిర్వహించడంతో పాటు, చర్చిలు, మసీదులను సందర్శించి ప్రార్థనలు చేశారు. సర్వమత సమభావాన్ని చాటుతూ అన్ని మతాల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు.
మరోవైపు MNR అభిమానులు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా, నాగేశ్వరరెడ్డి స్వయంగా పాల్గొని వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం గ్రామ ప్రజలను కలుసుకుని వారి ఆశీస్సులు, శుభాకాంక్షలు స్వీకరించారు.
ఇక రెడ్డిగూడెంలోని అనేక వేదికలపై కేక్ కటింగ్లతో MNR అభిమానులు, టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎటుచూసినా శుభాకాంక్షలు, అభిమానుల సందడి కనిపించింది.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రారంభమై… సేవా కార్యక్రమాలతో కొనసాగి… ప్రజల ఆశీస్సులతో పండుగలా సాగిన నాగేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు రెడ్డిగూడెంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 💐🙏



