టంగుటూరు: ఒంగోలు మినీ స్టేడియంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో జమ్మలపాలెం విద్యార్థులు, యువకులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు.
అండర్-17 విభాగంలో దుగ్గిరాల అవినాష్, అండర్-23 విభాగంలో కే.వీ. సుధీర్, పి. ఆకాష్, సాత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ టి. అశోక్ బాబు తెలిపారు.
రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ వాలీబాల్ పోటీల్లో జమ్మలపాలెం క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి, ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దలు, యువకులు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ అందించిన పీడీ టి. అశోక్ బాబును గ్రామస్థులు అభినందించారు.

రాష్ట్రస్థాయి అమరావతి వాలీబాల్ ఛాంపియన్‌షిప్‌కు జమ్మలపాలెం క్రీడాకారుల ఎంపిక
టంగుటూరు: ఒంగోలు మినీ స్టేడియంలో ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహించిన అమరావతి ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో జమ్మలపాలెం విద్యార్థులు, యువకులు అద్భుత ప్రతిభ కనబరిచారు. వారి ప్రతిభను గుర్తించిన నిర్వాహకులు రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు. అండర్-17 విభాగంలో దుగ్గిరాల అవినాష్, అండర్-23 విభాగంలో కే.వీ. సుధీర్, పి. ఆకాష్, సాత్విక్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ టి. అశోక్ బాబు తెలిపారు. రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ వాలీబాల్ పోటీల్లో జమ్మలపాలెం క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి, ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని గ్రామ పెద్దలు, యువకులు ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో పాటు వారికి శిక్షణ అందించిన పీడీ టి. అశోక్ బాబును గ్రామస్థులు అభినందించారు.

