పున్నమి ప్రతినిధి, నంద్యాల | ఫిబ్రవరి 5, 2026:
రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కోసం చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమాన్ని నందికొట్కూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాడు గ్రామం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. సాగు, తాగునీటి అవసరాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అత్యంత కీలకమని పేర్కొన్నారు. పనులు పూర్తి చేసే వరకు రాజీ లేని పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.



