వెనుక బడిన రాయలసీమ అభివృద్ధికి యన్ టి ఆర్ శ్రీ కారం చుట్టగా నేడు చంద్రబాబు వాటిని కొనసాగిస్తున్న క్రమంలో
భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్న రాయలసీమ ను చూసి లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట వైస్సార్సీపీ డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టిందని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ యల్ సి బీద రవిచంద్ర ధ్వజమెత్తారు.బుధవారం విలేఖరుల సమావేశంలో బీద మాట్లాడుతూరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది 2020 జూన్ – జులైలో కాగా,నిలిపివేసింది 2021 జులై లో కాగా ,మరో మూడేళ్లపాటు వైస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగినా అనుమతులు రాకపోతే ఏ మాత్రం సంబంధం లేని తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ ను అడ్డుకుందని వైస్సార్సీపీ దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదం గా ఉందని అన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే నని జీవో తెచ్చుకున్నది వైస్సార్సీపీ ప్రభుత్వమే అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ అనుమతులను మూడేళ్లు పట్టించుకోకుండా వదిలేసిన పార్టీ వైస్సార్సీపీ, పెనాల్టీలు కట్టిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి అచ్చు ని రవిచంద్ర ఎద్దేవా చేశారు.రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల కోసం ఒక ఏడాదిలో చంద్రబాబు పెట్టిన ఖర్చు ను 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేయలేకపోయారని35313 కోట్ల నిధులతో 36 ప్రాజెక్ట్ లను మూడేళ్లలో పూర్తి చేసేందుకు ఇరిగేషన్ కేలండర్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక తాము ఇవ్వగా. 5 ఏళ్ల వైస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్ అభివృద్ధి ని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని ఆరోపించారు.5 ఏళ్ల పాలనలో అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, 3870 కోట్లు వెచ్చించి హంద్రీనీవా ని 2 ఏళ్లలో 1700 నుంచి 3500 క్యూ సెక్కులకు పెంచి చిట్టచివరి ఎకరా కు నీరు అందించిన చంద్రబాబు ను విమర్శించడమేమిటని ప్రశ్నించారు.
పులివెందుల కు కృష్ణా జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తరలించగా, 5 ఏళ్ల పాలన లో పులివెందుల కు తాగు, సాగు నీరు ప్రాజెక్ట్ లను సైతం పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి విషయం తెలిసిందే అని విమర్శించారు.
కడతామని చెప్పిన రాజోలు రిజర్వాయర్ కట్టారా? గండికోట నిర్వాసితులకు 10 లక్షలు ఇచ్చారా? కడపలో స్టీల్ ప్లాంట్ కడితేనే 2024 లో ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడ్డారా? అంటూ ప్రశ్నించారు.
మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆత్మీయ సోదరుడు గాలి జనార్థన రెడ్డి, మరోసారి మీరు శంఖుస్థాపనలు చేసినా,మరి 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేక పోయారు? నేడు స్టీల్ ప్లాంట్ కడుతున్నది చంద్రబాబు, కూటమి ప్రభుత్వం.కాదా అంటూ రవిచంద్ర నిలదీశారు.పట్టుసీమ 29/03/2015లో ప్రారంభం కాగా 28/03/2016 కి పూర్తి చేశారు, ఆరు నెలల (18/09/2015) తర్వాత తొలిసారిగా మోటారు ప్రారంభించి10 ఏళ్లలో 442 టీఎంసీ లు వినియోగించుకుని. 44 వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఏర్పరచగా పట్టుసీమ వృధా….అని తాను అధికారం లోకి వస్తే మూసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కి పట్టుసీమ బటన్ నొక్కక తప్పలేదని, చివరికి పట్టుసీమ యే దిక్కయిందని రవిచంద్ర అన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపింది తామేనని హరీష్ రావు 2021 లో ప్రకటించగా. అనుమతులు రావని తెలిసీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల పనులు చేసి దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.రాయలసీమ పరిస్థితి ని మార్చిన ఘనుడు చంద్రబాబే అనిరాయలసీమ నుండి ఎంతమంది పాలకులు పాలించినా… ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలతోనే రాయలసీమ అభివృద్ధి పుంజుకుందన్నది నగ్నసత్యం గా పేర్కొన్నారు..ఆనాడు ఎన్టీఆర్ గాలేరు – నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ పథకాలకు శ్రీకారం చుట్టగా, వాటి అభివృద్ధి పనులను చంద్రబాబు కొనసాగించారని,లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రపంచంలో నే అత్యుత్తమైన హార్టీ కల్చర్ హబ్ గా, పరిశ్రమలకు మోడల్ గా రాయలసీమ ను చంద్రబాబు మార్చారని.భారతదేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం పైగా ఆంధ్రప్రదేశ్ కి వస్తే, అందులో మూడొంతుల పెట్టుబడులు రాయలసీమ కు కేటాయించిన ఘనత చంద్రబాబుదే అన్నారు
4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.76 లక్షల మంది నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం దేశంలోనే ఒక ప్రాంతానికి(రాయలసీమ) ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుది కాగా పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు “మిషన్ రాయలసీమ” నారా లోకేష్ చేపట్టారని రవిచంద్ర కొనియాడారు.ఈ విలేకరుల సమావేశంలో అబ్దుల్ అజీజ్, శివప్రసాద్,కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి , రూప్ కుమార్ యాదవ్ , చెంచల బాబు యాదవ్ , జెన్నీ రమణయ్య ,కొండూరు పాలిశెట్టి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రాయలసీమ అభివృద్ధికి శ్రీకారం యన్ టి ఆర్ దే వై.సి.పి లిఫ్ట్ ఇరిగేషన్ డ్రామా పై బీదా ధ్వజం
వెనుక బడిన రాయలసీమ అభివృద్ధికి యన్ టి ఆర్ శ్రీ కారం చుట్టగా నేడు చంద్రబాబు వాటిని కొనసాగిస్తున్న క్రమంలో భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందబోతున్న రాయలసీమ ను చూసి లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట వైస్సార్సీపీ డైవర్షన్ రాజకీయాలు మొదలు పెట్టిందని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యమ్ యల్ సి బీద రవిచంద్ర ధ్వజమెత్తారు.బుధవారం విలేఖరుల సమావేశంలో బీద మాట్లాడుతూరాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు టెక్నికల్, అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చింది 2020 జూన్ – జులైలో కాగా,నిలిపివేసింది 2021 జులై లో కాగా ,మరో మూడేళ్లపాటు వైస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగినా అనుమతులు రాకపోతే ఏ మాత్రం సంబంధం లేని తెలుగుదేశం పార్టీ ప్రాజెక్ట్ ను అడ్డుకుందని వైస్సార్సీపీ దుష్ప్రచారం చేయడం హాస్యాస్పదం గా ఉందని అన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తాగునీటి ప్రాజెక్ట్ మాత్రమే నని జీవో తెచ్చుకున్నది వైస్సార్సీపీ ప్రభుత్వమే అని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ అనుమతులను మూడేళ్లు పట్టించుకోకుండా వదిలేసిన పార్టీ వైస్సార్సీపీ, పెనాల్టీలు కట్టిన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి అచ్చు ని రవిచంద్ర ఎద్దేవా చేశారు.రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ల కోసం ఒక ఏడాదిలో చంద్రబాబు పెట్టిన ఖర్చు ను 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేయలేకపోయారని35313 కోట్ల నిధులతో 36 ప్రాజెక్ట్ లను మూడేళ్లలో పూర్తి చేసేందుకు ఇరిగేషన్ కేలండర్ ద్వారా స్పష్టమైన ప్రణాళిక తాము ఇవ్వగా. 5 ఏళ్ల వైస్సార్సీపీ పాలనలో ఇరిగేషన్ అభివృద్ధి ని జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని ఆరోపించారు.5 ఏళ్ల పాలనలో అదనంగా ఒక్క ఎకరాకు నీరు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి, 3870 కోట్లు వెచ్చించి హంద్రీనీవా ని 2 ఏళ్లలో 1700 నుంచి 3500 క్యూ సెక్కులకు పెంచి చిట్టచివరి ఎకరా కు నీరు అందించిన చంద్రబాబు ను విమర్శించడమేమిటని ప్రశ్నించారు. పులివెందుల కు కృష్ణా జలాలను ముఖ్యమంత్రి చంద్రబాబు తరలించగా, 5 ఏళ్ల పాలన లో పులివెందుల కు తాగు, సాగు నీరు ప్రాజెక్ట్ లను సైతం పూర్తి చేయలేకపోయిన జగన్మోహన్ రెడ్డి విషయం తెలిసిందే అని విమర్శించారు. కడతామని చెప్పిన రాజోలు రిజర్వాయర్ కట్టారా? గండికోట నిర్వాసితులకు 10 లక్షలు ఇచ్చారా? కడపలో స్టీల్ ప్లాంట్ కడితేనే 2024 లో ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడ్డారా? అంటూ ప్రశ్నించారు. మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి, ఆత్మీయ సోదరుడు గాలి జనార్థన రెడ్డి, మరోసారి మీరు శంఖుస్థాపనలు చేసినా,మరి 5 ఏళ్లలో స్టీల్ ప్లాంట్ ఎందుకు కట్టలేక పోయారు? నేడు స్టీల్ ప్లాంట్ కడుతున్నది చంద్రబాబు, కూటమి ప్రభుత్వం.కాదా అంటూ రవిచంద్ర నిలదీశారు.పట్టుసీమ 29/03/2015లో ప్రారంభం కాగా 28/03/2016 కి పూర్తి చేశారు, ఆరు నెలల (18/09/2015) తర్వాత తొలిసారిగా మోటారు ప్రారంభించి10 ఏళ్లలో 442 టీఎంసీ లు వినియోగించుకుని. 44 వేల కోట్ల రూపాయల రెవెన్యూ ఏర్పరచగా పట్టుసీమ వృధా….అని తాను అధికారం లోకి వస్తే మూసేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి కి పట్టుసీమ బటన్ నొక్కక తప్పలేదని, చివరికి పట్టుసీమ యే దిక్కయిందని రవిచంద్ర అన్నారు.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను ఆపింది తామేనని హరీష్ రావు 2021 లో ప్రకటించగా. అనుమతులు రావని తెలిసీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెయ్యి కోట్ల పనులు చేసి దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.రాయలసీమ పరిస్థితి ని మార్చిన ఘనుడు చంద్రబాబే అనిరాయలసీమ నుండి ఎంతమంది పాలకులు పాలించినా… ఆనాడు ఎన్టీఆర్, ఈనాడు చంద్రబాబు చేసిన ప్రయత్నాలతోనే రాయలసీమ అభివృద్ధి పుంజుకుందన్నది నగ్నసత్యం గా పేర్కొన్నారు..ఆనాడు ఎన్టీఆర్ గాలేరు – నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ పథకాలకు శ్రీకారం చుట్టగా, వాటి అభివృద్ధి పనులను చంద్రబాబు కొనసాగించారని,లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రపంచంలో నే అత్యుత్తమైన హార్టీ కల్చర్ హబ్ గా, పరిశ్రమలకు మోడల్ గా రాయలసీమ ను చంద్రబాబు మార్చారని.భారతదేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం పైగా ఆంధ్రప్రదేశ్ కి వస్తే, అందులో మూడొంతుల పెట్టుబడులు రాయలసీమ కు కేటాయించిన ఘనత చంద్రబాబుదే అన్నారు 4.58 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.76 లక్షల మంది నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం దేశంలోనే ఒక ప్రాంతానికి(రాయలసీమ) ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుది కాగా పాదయాత్ర లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు “మిషన్ రాయలసీమ” నారా లోకేష్ చేపట్టారని రవిచంద్ర కొనియాడారు.ఈ విలేకరుల సమావేశంలో అబ్దుల్ అజీజ్, శివప్రసాద్,కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి,కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి , రూప్ కుమార్ యాదవ్ , చెంచల బాబు యాదవ్ , జెన్నీ రమణయ్య ,కొండూరు పాలిశెట్టి, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

