వెంకటాచలం మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సెప్టెంబర్ 7న రానున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. ఐజీపీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, యూపీ డీఐజీ ఎం. హేమ్ రాజ్ మీనాతో కలిసి అధికారులు హెలిప్యాడ్, అక్షర విద్యాలయం, స్వర్ణ భారత్ ట్రస్ట్ పరిసరాలను పరిశీలించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక బలగాలను మోహరించనున్నట్లు వెల్లడించారు.

యోగి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు