Friday, 14 August 2026
  • Home  
  • యువతకు కొత్త బాధ్యతలు బద్వేల్ బిసివై పార్టీ
- కడప

యువతకు కొత్త బాధ్యతలు బద్వేల్ బిసివై పార్టీ

యువతకు కొత్త బాధ్యత.. బద్వేల్‌లో బీసీవై పార్టీ బలోపేతం! బీసీవై పార్టీ యువ, విద్యార్థి విభాగాల్లో కీలక నియామకాలు ఆగస్టు 13, 2026 | పున్నమి ప్రతినిధి – బద్వేల్ భారత చైతన్య యువజన పార్టీ (BCY)ని బద్వేల్ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా యువ, విద్యార్థి విభాగాల్లో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా యువతను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు. విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ యాదవ్, కడప జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా తోడేటి నరేంద్ర బాబును నియమించారు. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో విద్యార్థి విభాగం కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ యువత, విద్యార్థులను ఏకం చేస్తూ ప్రజా సమస్యలపై చైతన్యంతో ముందుకు సాగాలని, బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. “యువతే బలం.. యువతే భవిష్యత్తు” అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

యువతకు కొత్త బాధ్యత.. బద్వేల్‌లో బీసీవై పార్టీ బలోపేతం!

బీసీవై పార్టీ యువ, విద్యార్థి విభాగాల్లో కీలక నియామకాలు

ఆగస్టు 13, 2026 | పున్నమి ప్రతినిధి – బద్వేల్

భారత చైతన్య యువజన పార్టీ (BCY)ని బద్వేల్ నియోజకవర్గంలో మరింత బలోపేతం చేసే దిశగా యువ, విద్యార్థి విభాగాల్లో కీలక నియామకాలు చేపట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా యువతను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.

విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బీసీ సురేష్ యాదవ్, కడప జిల్లా యూత్ కన్వీనర్ కట్ల వెంకట నాగార్జున ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గ యూత్ కన్వీనర్‌గా తోడేటి నరేంద్ర బాబును నియమించారు. అలాగే బద్వేల్ నియోజకవర్గంలో విద్యార్థి విభాగం కమిటీలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ యువత, విద్యార్థులను ఏకం చేస్తూ ప్రజా సమస్యలపై చైతన్యంతో ముందుకు సాగాలని, బద్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. నూతన బాధ్యతలు స్వీకరించిన నాయకులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

“యువతే బలం.. యువతే భవిష్యత్తు” అంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.