Friday, 21 August 2026
  • Home  
  • యువకుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
- ఆంధ్రప్రదేశ్

యువకుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మృతిముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు


ఆగస్టు 20 ముద్దనూరు: వైఎస్ఆర్ కడప జిల్లా ముద్దనూరు మండలం మంగపట్నం గ్రామం సమీపంలోని ‘మేసన్ రెడీ మిక్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పరిశ్రమలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతపురం జిల్లా పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన నడిమింటి రామాంజినేయులు (49) అనే వ్యక్తి ముద్దనూరు సమీపంలోని మేసన్ రెడీ మిక్స్ పరిశ్రమలో నివసిస్తూ, పని చేస్తున్నాడు.ఈ నెల 19వ తేదీ రాత్రి 10:30 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10:45 గంటల మధ్య సమయంలో రామాంజినేయులు ఫ్యాక్టరీ ప్రాంగణంలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.వెంటనే ఆయన్ను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి డ్యూటీ డాక్టర్ పరీక్షించి, అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.మృతుడి కుమారుడు నడిమింటి ఫణీంద్ర (21) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముద్దనూరు పోలీసులు గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు కేసు నమోదు చేశారు. రామాంజినేయులు మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో, మరణానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.