Monday, 8 June 2026
  • Home  
  • యార్డు వద్ద లారీ ప్రమాదం.. వ్యక్తి మృతి
- తిరుపతి

యార్డు వద్ద లారీ ప్రమాదం.. వ్యక్తి మృతి

తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేల్ మండలం కేఎస్ అగ్రహారం పరిధిలోని మామిడికాయల యార్డు వద్ద ఆదివారం అర్ధరాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, మామిడికాయలతో పూర్తిగా లోడైన లారీ యార్డు వద్ద నిలిపి ఉంచగా, కేఎస్ అగ్రహారానికి చెందిన మొట్టగారి ఈశ్వరయ్య (38) లారీ వెనుక టైరు సమీపంలో పడుకుని ఉన్నాడు. అనంతరం లారీని యార్డులోకి తరలించే సమయంలో డ్రైవర్ అతడిని గమనించకపోవడంతో వాహనం ముందుకు కదిలి ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఈశ్వరయ్యను స్థానికులు వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మొట్టగారి సుబ్రహ్మణ్యం కుమారుడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.