యాచారం–నందివనపర్తి రోడ్డు పనులు చేపట్టాలి
యాచారం: యాచారం మండలం నుంచి నందివనపర్తికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ బీఆర్‌ఎస్ పార్టీ యువజన విభాగం యాచారం మండలాధ్యక్షుడు జానీ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జానీ మాట్లాడుతూ.. యాచారం–నందివనపర్తి ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతినడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో రహదారిపై గుంతలు ఏర్పడి పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టి, నాణ్యమైన రహదారిని నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు.
ప్రజల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చినట్లు జానీ తెలిపారు.



