ఇండియన్ ఎపిలెప్సీ అసోసియేషన్ (IEA) వార్షిక సదస్సులో జాతీయ మూర్ఛ వ్యాధి విధాన కార్యక్రమాలకు IEA సెక్రటరీ జనరల్, నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డా. బిందు మీనన్ నాయకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 7–9 వరకు లుధియానాలో జరుగుతున్న సదస్సును ICMR డైరెక్టర్ జనరల్ ప్రారంభించారు. సుమారు 600 మంది జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొన్నారు. మూర్ఛ వ్యాధిగ్రస్తుల డ్రైవింగ్ నిబంధనలు, వైకల్య ధృవీకరణ, బీమా అంశాలపై మూడు జాతీయ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసినట్లు డా. బిందు మీనన్ ప్రకటించారు. బాధితులకు విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, సామాజిక మద్దతు మెరుగుపరిచే విధాన సిఫార్సులను రూపొందించనున్నట్లు తెలిపారు.

మూర్ఛ వ్యాధి విధానాలకు డా. బిందు మీనన్ నాయకత్వం