Wednesday, 12 August 2026
  • Home  
  • మూడుసార్లు శస్త్రచికిత్సలైనా తగ్గని సమస్యకు అపోలోలో అరుదైన ఆపరేషన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మూడుసార్లు శస్త్రచికిత్సలైనా తగ్గని సమస్యకు అపోలోలో అరుదైన ఆపరేషన్

మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నప్పటికీ ఉపశమనం పొందని 37 ఏళ్ల వ్యక్తికి నెల్లూరు అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ‘సిరింగో-సబారాచనాయిడ్ షంట్’ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. నాలుగు చేతులు, కాళ్లలో బలహీనతతో బాధపడుతున్న రోగిని చీఫ్ న్యూరోసర్జన్ డాక్టర్ వెంకట్ బృందం పరిశీలించి, ‘చియారి-I మాల్ఫర్మేషన్’తో పాటు వెన్నుపాములో సిరింక్స్ ఏర్పడినట్లు గుర్తించింది. అత్యాధునిక మైక్రోస్కోప్ సహాయంతో వెన్నుపాములో నిలిచిన ద్రవాన్ని తొలగించి, మైక్రో క్యాథెటర్‌ను అమర్చారు. శస్త్రచికిత్స అనంతరం రోగి వేగంగా కోలుకుని రెండు రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్టమైన మైక్రో-న్యూరో సర్జరీలు నెల్లూరులోనే అందుబాటులో ఉండటం ప్రాంత ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.