శ్రీకాళహస్తి, మార్చి 20, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముస్లిం సోదర సోదరీమణులకు తన హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమ నిష్టలు, సహనం, దయ, సమానత్వం వంటి గొప్ప విలువలను బోధించే దైవిక కాలమని పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో అల్లాహ్‌ను స్మరిస్తూ ఉపవాస దీక్షలు ఆచరించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. వారు పాటించిన ఉపవాసాలు ఫలించి, అల్లాహ్ కరుణ కటాక్షాలు ప్రతి కుటుంబంపై నిలిచి ఉండాలని ప్రేమ, పంచుకోవడం, పరస్పర గౌరవం, సోదరభావం వంటి విలువలను పెంపొందించే రంజాన్ సందేశాన్ని అందరూ జీవితాల్లో ఆచరించాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితం ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో నిండాలని ప్రార్థించారు.

అల్లాహ్ కరుణ అందరిపై ఉండాలి- ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి