పున్నమి: రంగారెడ్డి జిల్లా: మునగనూరు,
మునగనూరు–తొర్రూర్ రోడ్డులో ఎంజీ1 భూమి సంస్థకు చెందిన ‘మల్లికార్జున ఎంజీ1 భూమి ఈవీ షోరూమ్’ నూతనంగా ప్రారంభమైంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్రెడ్డి రాంరెడ్డి, ఎంజీ1 భూమి చైర్మన్ అండ్ ఎండీ కోత మనోహర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్రెడ్డి యాది రెడ్డి, మల్రెడ్డి అభిషేక్ రెడ్డి, గోపాల్ రెడ్డి, వేముల అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా ప్రారంభమైన ఈవీ షోరూమ్‌లో వివిధ రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు కరెడ్ల ఎల్ల రెడ్డి సుజాత గార్ల కుమార్లలు వరు కారెడ్ల సానిత్ రెడ్డి, కరెడ్ల అముల్ రెడ్డి తెలిపారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఈవీ వాహనాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అతిథులు షోరూమ్‌ను సందర్శించి వాహనాలను పరిశీలించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, వాహన ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



