Thursday, 7 May 2026
  • Home  
  • ముచ్చవోలులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సభ
- తిరుపతి

ముచ్చవోలులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజా సభ

శ్రీకాళహస్తి, మే 07 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రెవెన్యూ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఒక నెల – ఒక గ్రామం – నాలుగు పర్యటనలు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముచ్చవోలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి గ్రామంలో ‘ప్రజా సభ’ నిర్వహించి, గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాభివృద్ధికి అవసరమైన పనులపై చర్చించడంతో పాటు, ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించి వారి సమస్యలను సుధీర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. గడప వద్దకే పరిష్కారం ప్రజల సమస్యలను వారి గడప వద్దే పరిష్కరించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గంగినేని చెంచయ్య నాయుడు, శ్రీకాళహస్తి తహసిల్దార్ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.