Friday, 2 October 2026
  • Home  
  • మింది ATM రోడ్డు ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీస్ కమిషనర్*
- విశాఖపట్నం

మింది ATM రోడ్డు ట్రాఫిక్ సమస్యపై స్పందించిన పోలీస్ కమిషనర్*

మింది ATM రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న భారీ ట్రాఫిక్ సమస్యపై మాజీ కార్పొరేటర్ *గుడివాడ అనూష* గారు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక ట్రాఫిక్ పోలీసులను మింది ATM రోడ్డుకు పంపించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గాజువాక CI గారికి మరియు కమిషనర్ గారికి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు. మింది ATM రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితిని మరింతగా అధ్యయనం చేసేందుకు రానున్న కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధుల్లో ఉంచి, వాహనాల రాకపోకలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన పోలీస్ కమిషనర్ గారికి, గాజువాక ట్రాఫిక్ పోలీసులకు మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష గారు కృతజ్ఞతలు తెలిపారు.

మింది ATM రోడ్డులో రోజురోజుకూ పెరుగుతున్న భారీ ట్రాఫిక్ సమస్యపై మాజీ కార్పొరేటర్ *గుడివాడ అనూష* గారు నిన్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేసి, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

దీనిపై స్పందించిన పోలీస్ కమిషనర్ గారు ఈరోజు గాజువాక ట్రాఫిక్ పోలీసులను మింది ATM రోడ్డుకు పంపించి, అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గాజువాక CI గారికి మరియు కమిషనర్ గారికి పరిస్థితిపై వివరాలు తెలియజేశారు.

మింది ATM రోడ్డులో ట్రాఫిక్ పరిస్థితిని మరింతగా అధ్యయనం చేసేందుకు రానున్న కొన్ని రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులను అక్కడ విధుల్లో ఉంచి, వాహనాల రాకపోకలను పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే స్పందించి చర్యలు చేపట్టిన పోలీస్ కమిషనర్ గారికి, గాజువాక ట్రాఫిక్ పోలీసులకు మాజీ కార్పొరేటర్ గుడివాడ అనూష గారు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.