Friday, 10 July 2026
  • Home  
  • మానవత్వమే మతం.. పేద కుటుంబాలకు రూ.70 వేల ఆర్థిక భరోసా అందించిన కంచి పరమేశ్వర రెడ్డి
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మానవత్వమే మతం.. పేద కుటుంబాలకు రూ.70 వేల ఆర్థిక భరోసా అందించిన కంచి పరమేశ్వర రెడ్డి

ఆత్మకూరు, జూలై 10 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): పేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవాలనే లక్ష్యంతో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు నిర్వహించలేని నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తూ, శుక్రవారంనాడు ఏడు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. గత రెండేళ్లుగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి, ఇటీవల ఈ సేవా కార్యక్రమాన్ని ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. పట్టణంతో పాటు గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి వారి ఇళ్లకే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా మురగళ్ల ఎస్సీ కాలనీకి చెందిన తోడేటి శామ్యూల్ (71) కుటుంబానికి, బోయిలా చిరివెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన ఉప్పనూతల నిర్మలమ్మ (58) కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు పఠాన్ ఖాదర్ బీ (86), 13వ వార్డు ఎర్రమట్టిగుంటకు చెందిన షేక్ అహ్మద్ షరీఫ్ (44), పిడుగు రంగయ్య వీధికి చెందిన రామాపురం పెంచలయ్య (66), 19వ వార్డు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ అమీర్ భాష (61), 22వ వార్డు జ్యోతి నగర్‌కు చెందిన పండగ సుబ్బమ్మ (66) కుటుంబాలకు కూడా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ పేద కుటుంబం కూడా తమ ఆప్తుల అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు పడకూడదనేదే నా లక్ష్యం. మానవత్వానికి మించిన మతం లేదు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా అవసరమైన ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందిస్తూనే ఉంటాను” అని అన్నారు. అంతేకాకుండా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకుల కోసం సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వేలాది మంది ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలనే సంకల్పంతో ట్రస్ట్ పనిచేస్తోందన్నారు. ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు కంచి పరమేశ్వర రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్ట సమయంలో అందించిన ఈ సహాయం తమకు గొప్ప అండగా నిలిచిందని వారు పేర్కొన్నారు. స్థానికులు కూడా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, ఇటువంటి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.

ఆత్మకూరు, జూలై 10 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

పేద కుటుంబాలకు కష్టకాలంలో అండగా నిలవాలనే లక్ష్యంతో సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, నిత్యాన్నదాత కంచి పరమేశ్వర రెడ్డి మరోసారి తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అంత్యక్రియలు నిర్వహించలేని నిరుపేద కుటుంబాలకు చేయూతనందిస్తూ, శుక్రవారంనాడు ఏడు కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

గత రెండేళ్లుగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేద కుటుంబాలకు మాత్రమే ఈ సేవలను అందిస్తున్న కంచి పరమేశ్వర రెడ్డి, ఇటీవల ఈ సేవా కార్యక్రమాన్ని ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించారు. పట్టణంతో పాటు గ్రామాల్లోని పేదల కష్టాలను గుర్తించి వారి ఇళ్లకే వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా మురగళ్ల ఎస్సీ కాలనీకి చెందిన తోడేటి శామ్యూల్ (71) కుటుంబానికి, బోయిలా చిరివెళ్ల ఎస్సీ కాలనీకి చెందిన ఉప్పనూతల నిర్మలమ్మ (58) కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు పఠాన్ ఖాదర్ బీ (86), 13వ వార్డు ఎర్రమట్టిగుంటకు చెందిన షేక్ అహ్మద్ షరీఫ్ (44), పిడుగు రంగయ్య వీధికి చెందిన రామాపురం పెంచలయ్య (66), 19వ వార్డు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ అమీర్ భాష (61), 22వ వార్డు జ్యోతి నగర్‌కు చెందిన పండగ సుబ్బమ్మ (66) కుటుంబాలకు కూడా చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కంచి పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ, “ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ పేద కుటుంబం కూడా తమ ఆప్తుల అంత్యక్రియలు నిర్వహించడంలో ఇబ్బందులు పడకూడదనేదే నా లక్ష్యం. మానవత్వానికి మించిన మతం లేదు. కుల, మత, రాజకీయ భేదాలకు అతీతంగా అవసరమైన ప్రతి కుటుంబానికి నా వంతు సహాయం అందిస్తూనే ఉంటాను” అని అన్నారు.

అంతేకాకుండా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకుల కోసం సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతర నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వేలాది మంది ఆకలి తీర్చుతున్నారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలనే సంకల్పంతో ట్రస్ట్ పనిచేస్తోందన్నారు.

ఆర్థిక సహాయం అందుకున్న కుటుంబ సభ్యులు కంచి పరమేశ్వర రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత క్లిష్ట సమయంలో అందించిన ఈ సహాయం తమకు గొప్ప అండగా నిలిచిందని వారు పేర్కొన్నారు. స్థానికులు కూడా ట్రస్ట్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, ఇటువంటి సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.