మాతమ్మ తల్లి ఉత్సవాల్లో కాకాణి.. చవటపాలెంలో ఘన స్వాగతం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న మాతమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తప్పెట్లు, మేళతాళాలు, బాణసంచా కాల్పులు, జై జగన్–జై కాకాణి నినాదాల మధ్య ఆయనను దేవాలయానికి తీసుకువెళ్లారు. అనంతరం మాతమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాలకు ఆహ్వానించిన కమిటీ నిర్వాహకులకు కాకాణి ధన్యవాదాలు తెలిపారు.

మాతమ్మ తల్లి ఉత్సవాల్లో కాకాణి.. చవటపాలెంలో ఘన స్వాగతం
మాతమ్మ తల్లి ఉత్సవాల్లో కాకాణి.. చవటపాలెంలో ఘన స్వాగతం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చవటపాలెం గ్రామంలో నిర్వహిస్తున్న మాతమ్మ తల్లి ఉత్సవాల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. తప్పెట్లు, మేళతాళాలు, బాణసంచా కాల్పులు, జై జగన్–జై కాకాణి నినాదాల మధ్య ఆయనను దేవాలయానికి తీసుకువెళ్లారు. అనంతరం మాతమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాలకు ఆహ్వానించిన కమిటీ నిర్వాహకులకు కాకాణి ధన్యవాదాలు తెలిపారు.

