శ్రీకాళహస్తి, ఏప్రిల్ 27 (పున్నమి న్యూస్( : మహిళల ఆర్థిక అభివృద్ధి, సామాజిక సాధికారత లక్ష్యంగా నియోజకవర్గవ్యాప్తంగా వెలుగు సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి బొజ్జల రిశితా రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట, ఏర్పేడు మండలాలకు చెందిన 200 మంది సంఘమిత్రులకు సుమారు రూ.37 లక్షల వ్యయంతో ఆధునిక స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ ఫోన్ల ద్వారా మహిళలు ప్రభుత్వ పథకాల సమాచారం సులభంగా పొందడమే కాకుండా, పొదుపు సంఘాల నిర్వహణలో పారదర్శకత, వేగం పెరుగుతాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడం ద్వారా వారి ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవాని ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళల సాధికారతకు సాంకేతిక తోడు – ఎమ్మెల్యేచే సంఘమిత్రలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ