Sunday, 9 August 2026
  • Home  
  • మల్లారంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ విక్రయాల కలకలం*
- ఖమ్మం

మల్లారంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ విక్రయాల కలకలం*

*మల్లారంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ విక్రయాల కలకలం* *ఎరువుల అమ్మకాలు అనుమతులు, నాణ్యతపై రైతుల్లో సందేహాలు* *వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని రైతుల విజ్ఞప్తి* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ తల్లాడ: మల్లారం గ్రామంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ పేరుతో ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కొంతమంది వ్యక్తులు వాహనంలో ఎరువుల బస్తాలను తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎరువుల విక్రయాలకు సంబంధించిన యాప్‌ అందుబాటులోకి రావడాన్ని ఆసరాగా చేసుకుని ఈ విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ‘ఆర్గానిక్ డీఏపీ’ ఉత్పత్తికి వ్యవసాయ శాఖ లేదా సంబంధిత విభాగాల అనుమతులు ఉన్నాయా ఉత్పత్తి చేసిన సంస్థ ఏది, ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నాయా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. రైతులకు విక్రయిస్తున్న ఎరువు నిజంగా డీఏపీకి ప్రత్యామ్నాయమా లేక ఇతర ఉత్పత్తిని ‘ఆర్గానిక్ డీఏపీ’ పేరుతో విక్రయిస్తున్నారా అనే విషయాలపై కూడా అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు. వాహనంలో తరలిస్తున్న ఎరువుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించడంతో పాటు, విక్రయదారుల వద్ద ఉన్న అనుమతులు, బిల్లులు, ఉత్పత్తి వివరాలను తనిఖీ చేయాలని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు. అధికారుల తనిఖీలతోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

*మల్లారంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ విక్రయాల కలకలం*

*ఎరువుల అమ్మకాలు అనుమతులు, నాణ్యతపై రైతుల్లో సందేహాలు*

*వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని రైతుల విజ్ఞప్తి*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

తల్లాడ:

మల్లారం గ్రామంలో ‘ఆర్గానిక్ డీఏపీ’ పేరుతో ఎరువుల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. కొంతమంది వ్యక్తులు వాహనంలో ఎరువుల బస్తాలను తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఎరువుల విక్రయాలకు సంబంధించిన యాప్‌ అందుబాటులోకి రావడాన్ని ఆసరాగా చేసుకుని ఈ విక్రయాలు సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ ‘ఆర్గానిక్ డీఏపీ’ ఉత్పత్తికి వ్యవసాయ శాఖ లేదా సంబంధిత విభాగాల అనుమతులు ఉన్నాయా ఉత్పత్తి చేసిన సంస్థ ఏది, ఉత్పత్తి నాణ్యతకు సంబంధించిన ధ్రువపత్రాలు ఉన్నాయా, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రైతులకు విక్రయిస్తున్న ఎరువు నిజంగా డీఏపీకి ప్రత్యామ్నాయమా లేక ఇతర ఉత్పత్తిని ‘ఆర్గానిక్ డీఏపీ’ పేరుతో విక్రయిస్తున్నారా అనే విషయాలపై కూడా అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని రైతులు పేర్కొంటున్నారు.
వాహనంలో తరలిస్తున్న ఎరువుల నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షలు నిర్వహించడంతో పాటు, విక్రయదారుల వద్ద ఉన్న అనుమతులు, బిల్లులు, ఉత్పత్తి వివరాలను తనిఖీ చేయాలని రైతులు వ్యవసాయ శాఖ అధికారులను కోరుతున్నారు. అధికారుల తనిఖీలతోనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

1 Comment

  1. Gajula Balaji

    August 9, 2026

    Today News

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.