గాజువాక, (పున్నమి ప్రతినిధి),సెప్టెంబర్ 13: పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని గాజువాక నియోజకవర్గంలో మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. వైసీపీ జిల్లా వాలంటీర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గొందేశి రామిరెడ్డి, నూతనంగా గ్రామ అధ్యక్షులుగా ఎన్నికైన గొందేశీ లక్ష్మణ్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల వల్ల జరిగే కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు, స్థానిక నాయకులు రామిరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ఈ విగ్రహాల పంపిణీలో స్థానిక యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మట్టి గణపతుల ఉచిత పంపిణీ